calender_icon.png 20 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి

20-09-2025 12:56:01 AM

 అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఆదేశం

తిమ్మాపూర్, సెప్టెంబరు19 : బతుకమ్మ,దసరా పండుగల నిర్వహణకు ఘనం గా ఏర్పాట్లు చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లపై ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఎంపీవోలు, స్పెషలాఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.   పండుగలు సమీపిస్తున్నందున అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు.

బతుకమ్మల నిమజ్జనం రోజున బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో కాంతివంతమైన దీపాలు ఏర్పాటు చేయాలని, ఇటీవలి వర్షాలకు రోడ్లపై పడిన గుంతలను వెంటనే పూడ్చి వేయించాలని, ముఖ్యంగా డ్రైనేజీల్లోనే కాకుండా రోడ్లపైన నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మల నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  పోలీసు అధికారులు తగిన బందో బస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యం గా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. 

సమావేశంలో జిల్లా సహకార అధికారి నర్సింహాచార్యులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వి.వి. వరలక్ష్మి, కె. ప్రవీణ్,వై.శశికళ,  తహసీల్దార్లు కె.విజయ్ కుమార్, కె.శ్రీనివాస్ రెడ్డి, పి.చంద్రశేఖర్, పంచాయతీ రాజ్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్ మంజుల భార్గవి, ఏఈఈలు ఎ.రాజేశ్, కె.వెంకన్న,ఎ.మౌనిక, ఇరిగేషన్ ఏఈఈలు ఎండీ ఆస్మా, వి.గంగాధర్ రావు,ఈ.రాజ్ కుమార్, ఏఈ కార్తీక్, మిషన్ భగీరథ ఏఈ రమేశ్, ఎఈఈ ఎం.విలాస్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, పోలీస్ సబ్ ఇన్ కె.శ్రీకాంత్ గౌడ్ (ఎల్‌ఎండి కాలనీ), స్పెక్టర్లు కె.స్వాతి (మానకొండూర్), జి.నరేందర్‌రెడ్డి (గన్నేరువరం), బి.సౌమ్య (బెజ్జంకి) తోపాటు వ్యవసాయ, వెటర్నరీ అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.