20-09-2025 12:53:59 AM
115 బృందాలతో పాటు 650 మంది విద్యార్థుల భాగస్వామ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో శుక్రవారం స్మార్ట్ ఇండియా హాకథాన్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. 115 బృందాలతో పాటు 650 మంది విద్యార్థులు కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యా రు. సృజనాత్మకత, సాంకేతికతను ఉపయోగించి చేసిన నూతన ఆవిష్కరణలో స్మార్ట్ ఇండియా హాకథాన్ కార్యక్రమంలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా 115 బృందాలు ప్రదర్శించిన వాటిలో 50 అత్యుత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేశారు. ఈ అత్యుత్తమ ఆవిష్కరణలను ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ స్మార్ట్ ఇండియా హాకథాన్‌కు పంపిస్తారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్‌బాబు, సెక్రటరీ డాక్టర్ డీ ప్రదీప్, డైరెక్టర్ జీ భగత్, వైస్ ప్రిన్సిపల్ సుబ్బారావు, కోఆర్డినేటర్ డాక్టర్ కండే శ్రీనివాస్, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.