24-01-2026 01:09:54 AM
‘మాడ్’, ‘మ్యాడ్ స్కేర్’ చిత్రాలతో అలరించిన యువ నటుడు సంగీత్ శోభన్. ఆయన సోలో హీరోగా తొలి చిత్రం రాబోతోంది. ‘రాకాస’ పేరుతో వస్తున్న ఈ సినిమాకు మానసశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్‌కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. నయన్ సారిక కథానాయిక కాగా.. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, అన్నపూర్ణ, గెటప్ శ్రీను, రోహిణి, రోహన్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ సాగే మాటలతో వీడియో ఆరంభమైంది. సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ మెప్పిస్తాడని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలమని ఈ గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం: సంగీతం: అనుదీప్ దేవ్; డీవోపీ: రాజు ఎదురోలు; యాక్షన్: విజయ్; ఎడిటర్: అన్వర్ అలీ; ఆర్ట్: పుల్ల విష్ణువర్ధన్.