calender_icon.png 24 January, 2026 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండపిండ బ్రహ్మాండాలను అల్లాడించే కథ!

24-01-2026 01:11:12 AM

ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో రూపొందుతున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. చిత్రాలయం స్టూడియో పతాకంపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజారవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేశారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు. అండ పిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’.., ‘ఏం చెప్పాలనుకుంటున్నారో కాస్త క్లారిటీగా చెప్పవా’.. అనే డైలాగులతో టీజర్ ప్రారంభమైంది. టీజర్ లాంచ్ అనంతరం నిర్మాత వేణు మాట్లాడుతూ “మేఘాలయాలో మొత్తం షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్టీఫెన్, ఆనంద్; కెమెరా: అజయ్ అబ్రహం జార్జ్; యాక్షన్స్: వింగ్ చున్ అంజి; ఆర్ట్: సాహి సురేశ్; ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు.