ఈ వారం వార్తల్లో..
మనన్‌పై అవినీతి మరక
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా మనన్‌కుమార్ సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి అతిథిగా సీజేఐ రావొద్దని యాజమాన్యానికి విద్యార్థులు లేఖ రాయడంపై ఆయా విద్యార్థులకు అడ్వొకేట్లుగా ఎన్‌రోల్‌మెంట్ రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంతలోనే కౌన్సిల్‌కు చెందిన రూ.౧౫౦ కోట్లు దారి మళ్లించారని ఆయనపై అభియోగం వచ్చింది.
ఇమ్రాన్‌ఖాన్‌కు చికిత్స
ఇమ్రాన్‌ఖాన్.. పాక్ మాజీ ప్రధాని.. ఆయన ప్రధానిగా కొనసాగిన సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఖైదు అనుభవిస్తూ వస్తున్నారు. ఒకసారి ఆయన చూపు మందిగించిందని, తాజాగానైతే ఏకంగా ఆయన మరణించారనే పుకార్లు వచ్చాయి. ఎలాగైతేనేం.. అక్కడి సుప్రీం కోర్టు స్పందించింది. తక్షణం చికిత్స అందించాలనే ఉత్తర్వులతో ఆయన ఎట్టకేలకు చికిత్స తీసుకుంటున్నారు.






