3 September, 2026 | 5:21 AM

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు

03-09-2026 | 03:25am

అమర ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలి

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(DR. BR Ambedkar)పై అనుచిత వ్యాఖ్యలు చేసి కల్పిత నాయకుడని అనే పుస్తకంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..... నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు విమర్శలు చేస్తున్న హమారా ప్రసాద్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తరతరాలుగా యుగ యుగాలుగా అంటరానితనం పెను ప్రమాదంలో దళిత జాతి సమాజం మగ్గుతున్నప్పుడు అగ్ని కణమై మండిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువు ద్వారానే ఈ సమాజాన్ని మార్చగలమనే  అంశాన్ని గుర్తించి తను ఉన్నతమైన చదువులు చదువుకొని తన కుటుంబాన్ని భార్య పిల్లల సైతం కోల్పోయి సబ్బండ జాతుల అనగారిన వర్గాల వర్గాల కోసం బడుగు బలహీన ప్రజల కోసం ఒక లిఖిత పూర్వకంగా ప్రపంచ దేశాలు మెచ్చుకునే రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అలాంటి మహనీయునిపై కల్పిత నాయకుడని అమర ప్రసాద్ అనే మూర్ఖుడు పుస్తకాన్ని రాయడం అనేది సిగ్గుచేటు అతనిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకత్వన డిమాండ్ చేశారు. సామాజిక కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న అమర ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, ఎమ్మార్పీఎస్ నాయకులు పోర్నందుల సురేష్,  ఇల్లందుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.