17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆదిలాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాలు..

27-06-2025 01:30 AM
  1. పొంగిపొర్లుతున్న వాగులువంకలు
    1. బండల వాగులో యువకుడి గల్లంతు..
    2. పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతం..

ఆదిలాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొం గిపొర్లుతున్నాయి. ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు తాత్కాలిక వంతెనపై నుండి వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలం నిషాన్ ఘాట్ వద్ద గల బండల వాగులో ఓ యువకుడు గల్లంతు అయిన ఘటన చోటుచేసుకుంది.

ఆదిలాబాద్‌కు చెందిన కొందరు యువకులు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. వీరిలో శేఖర్ అనే యువకుడు చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి గల్లంతయ్యా డు. తోటి మిత్రుడు అతడిని రక్షించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వెం టనే విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పరవళ్లు తొక్కుతున్న కుంటాల

ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షం తోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భారీ వర్షానికి రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం కుంటాలకు భారీ వరద వచ్చి చేరింది. ఎత్తయిన కొండలపై నుంచి జాలువారుతున్న వరదనీటి తో జలపాతం కనువిందు చేస్తోంది.