calender_icon.png 7 October, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగృతిలో చేరికలు

07-10-2025 12:49:37 AM

కరీంనగర్ క్రైం, అక్టోబరు 6 (విజయ క్రాంతి): బిసి కుల సంఘాల నాయకులు శ్రీరాముల రమేష్, గర్షకుర్తి విద్యాసాగర్, కో త్వాల అంజనేయులు, తదితరులు సోమవారం తెలంగాణ జాగృతిలో చేరారు. జా గృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ వారికి కండువ కప్పి జాగృతి లోకి అహ్వనించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లా డుతూ కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతిని కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేయడం జరుగుతుందని, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన అస్తిత్వాన్ని కాపాడటం కోసం నిరంతరం జాగృతి కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవా చేయటమే లక్ష్యంగా కవిత జాగృతిని స్థాపించిందని, ఇప్పుడు జాగృతిని, అనుబంధ సంఘాలను బలోపేతం చెయ్యాటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.