7 July, 2026 | 2:17 AM

చేపల ఉత్పత్తితో మత్స్యకారులకు ఆదాయం

07-07-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

బోయినపల్లి: జూలై 6(విజయక్రాంతి):ప్రభుత్వ పథకాలతో చేపల ఉత్పత్తి పెరుగుదలతో మత్స్యకారులకు ఆదాయం వృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్ బృందం, కేంద్ర ప్రభుత్వ అధికారులు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు చైర్మన్ కమిటీ .. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలిశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ .. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మత్స్యకారుల ఆర్ధిక వృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. దీంతో చేపల ఉత్పత్తి పెరుగుతుందని మత్స్యకారుల సంక్షేమ, అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. సహకార సంఘాలకు ఆర్థిక సహాయం అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించి.. రాజన్న సిరిసిల్ల జిల్లా

బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని బృందం సందర్శించింది. ఉత్పత్తి వివరాలు, ఆదాయం, నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు.సమావేశంలో వరల్ బ్యాంక్ బృందం కమిటీ సభ్యులు జూలియన్ మిలియన్, అనుజా శుక్లా, ఆర్పీ సిలార్డ్, ఇంతిసార్ ఎ. సిద్దిఖీ, దీపా సుమన్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.