13-11-2025 12:00:00 AM
అస్తవ్యస్తంగా అంగన్వాడీ కేంద్రాలు
మహబూబాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో మాతా శిశువులు అసౌకర్యానికి గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా 1,437 అంగన్వాడీ కేం ద్రాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సొంతభవనాలు 341 ఉండగా, 620 ఉచిత భవనా ల్లో నిర్వహిస్తున్నారు. 474 అంగన్వాడీ కేం ద్రాలు అరకొర వసతులతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
సొంత, ఉచిత భవనాల్లో కూడా చాలా చోట్ల సరైన వసతులు లేవు. 385 అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా, మరో 343 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సౌకర్యం సరిగా లేదు. ఇక 645 అంగన్వాడి కేంద్రాలకు వి ద్యుత్ సౌకర్యం లేకపోవడం విశేషం. 767 అంగన్వాడి కేంద్రాలకు టాయిలెట్లు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అ నేక అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించినప్పటికీ చాలా చోట్ల శిధి లంగా మారాయి.
వసతి ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ని ర్వహిస్తున్నారు. దీనితో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనకు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు గదులు సరిపోక ఇ బ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల తా గునీటి వసతి, టాయిలెట్లు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు అంగన్వాడి కేం ద్రాల్లో ఉండలేకపోతున్నారు.
తల్లిదండ్రులు చంటి బిడ్డలను అసౌకర్యాల అంగన్వాడీ కేం ద్రాలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. చిన్నారులు ఆటలాడుకోవడానికి సరైన వసతి లేక చాలా చోట్ల క్రీడా పరికరాలు వినియోగించుకునే పరిస్థితి లేదు. కొన్నిచోట్ల ప్రభుత్వం నిర్మించిన అంగన్వాడి కేంద్రాలు నిర్వహణ సరిగా లేక అన్యాకాంతం అవుతున్నాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అంగన్వాడీ కేంద్రా ల్లో సౌకర్యాలు లేక ఎక్కువ సమయం అక్క డ ఉండే పరిస్థితి లేకపోవడంతో చాలా చోట్ల వచ్చి వెళ్తున్నారు.
కొన్నిచోట్ల నేరుగా గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పాలు, గుడ్లు, పౌష్టికాహారం నిర్వాహకులు వారి ఇంటికే పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా అంగన్వాడి కేంద్రాల నిర్మాణాలకు, మరమ్మతులకు ని ధులు మంజూరైనప్పటికీ పనులు ముందు కు సాగడం లేదని ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఉన్న సొంతభవనాలు శిథిలంగా మా రినప్పటికీ ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోవడంతో అక్కడే నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులతో పాటు చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు ప్రాణభయంతో కాలం నెట్టుకొస్తున్నారు.
ఒకే గదిలో రెండు సెంటర్ల నిర్వహణ..!
జిల్లాలోని పలుచోట్ల ఒకే గదిలో రెండు అంగన్వాడి కేంద్రాలను నిర్వహించడం జరుగుతోంది. పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే తరగతి గదిలో రెండు అంగన్వాడీ కేం ద్రాలను నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో సైతం రెండు కేంద్రాలను కలిపి నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సరైన వసతి సౌకర్యం లభించడం లేదని, దొరికిన చోట తప్పని పరిస్థితిలో ఒకే గదిలో రెండు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే రెండు కేంద్రాలను నిర్వహిస్తున్న చోట వంతుల వారీగా విధులు నిర్వహిస్తూ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి తోడు ఆ యా ఆవాస ప్రాంతాల్లోని తల్లులు, చంటి బిడ్డలను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావడానికి, తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళడానికి దూర భారం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వ స్పందించి అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి, సరైన వసతులు కల్పిం చి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ప్రాథమిక దశ నుంచే మెరుగైన పౌరులను తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ కేం ద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ఖాళీల భర్తీ ఎన్నడూ..?
జిల్లాలో పలుచోట్ల అంగన్వాడి కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. అటు అసౌకర్యాలు, ఇటు నిర్వాహ కుల లేమితో అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా మారిందని, వెంటనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజ లు కోరుతున్నారు.
సౌకర్యాలను మెరుగుపరుస్తాం:
మహబూబాబాద్ జిల్లాలో అసౌకర్యంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో సౌ కర్యాలను మెరుగుపరుస్తాం. ప్రభుత్వ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించడంతోపాటు, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేం ద్రాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉ న్న అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కారం కోసం నివేదిక రూపొందిస్తు న్నాం.
కొత్తగా అద్దెకు తీసుకునే భవనా ల్లో కనీస వసతులు ఉండేలా ముందుగానే చూస్తున్నాం. ఇప్పటికే నిర్వహి స్తు న్న అద్దె భవనాల్లో కనీస వసతుల కల్పనకు చర్యలు తీసుకొని బాలింతలు, గర్భి ణీలు, చిన్నపిల్లలకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం.
మాతా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి, ఎం.సబిత