13-11-2025 12:00:00 AM
వెంకటాపూర్(రామప్ప), నవంబర్12 (విజయక్రాంతి):మండలంలోని ప్రపంచ ప్ర ఖ్యాత గాంచిన యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయాన్ని స్వీడన్ దే శానికి చెందిన పర్యాటకుడు మైకేల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించగా అర్చకులు హ రీష్ శర్మ, ఉమాశంకర్ లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కట్టడ నిర్మాణ శైలి, కళాత్మక ప్రతిభను స్టేట్ టూరిజం గైడ్ సాయినాథ్, విజ య్ కుమార్ లు మైకేల్కు వివరించారు. రా మప్ప దేవాలయ సౌందర్యం, శిల్పకళ, ప్ర కృతి అందాలను చూసి మైకేల్ ఆశ్చర్యపో యి ప్రశంసలు కురిపించారు. అనంతరం ఆ యన రామప్ప చెరువును సందర్శించి బో టింగ్ చేశారు. వారి వెంట దేవాదాయ, టూ రిజం, పురావస్తు శాఖల సిబ్బంది, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు.