calender_icon.png 13 November, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడ జాగీర్‌లో అక్రమ నిర్మాణాలు

13-11-2025 12:00:00 AM

- భవనాల అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా

- “మాములు” గా తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

- స్నేహిత హిల్స్‌లో ఇష్టానుసారంగా నిర్మాణాలు  కొనసాగుతున్న అడ్డు చెప్పని అధికారులు 

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్, నవంబర్ 12 : హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం నత్త నడకన కొనసాగుతుందన్న సంగతి అటుంచితే.. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో   నూతన భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి . ఓ ఆర్ ఆర్ కు అతి సమీపంలో ఉండటంతో అటు హైటెక్ సిటీ కూకట్ పల్లి  లో నూతనంగా ఇండ్లు నిర్మించుకున్నాలనుకునే వారు కూడా అప్పా జంక్షన్. సన్ సిటీ  . స్నేహిత హిల్స్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లు కొనాలనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది సన్ సిటీ సమీపంలోని స్నేహిత హిల్స్ లో అపార్ట్మెంట్ల నిర్మాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి .

ఈ నిర్మాణాల్లో భవన నిర్మాణ యజమానులు కనీస నిబంధనలు పాటించడం లేదు. అపార్ట్మెంట్ ల భవన నిర్మాణాలకు తీసుకున్న అనుమతుల కంటే ఒకటి రెండు ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ఆపడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను మామూలుగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. సంబంధిత అపార్ట్మెంట్లలో కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ వినియోగదారులకు అడ్డదిడ్డంగా విక్రయం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర 

స్నేహిత హిల్స్ కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ అధికారుల తో మాట్లాడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి భవన యజమానులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు.