calender_icon.png 11 December, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

10-12-2025 02:47:12 AM

పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

అసిఫాబాద్‌లోని తిర్యానిలో అత్యల్పంగా 6.1 డిగ్రీలు నమోదు  

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో  బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోనున్నాయి.

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు , ఆదిలాబాద్ బీమ్‌పూర్‌లో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జర్సానాగాంలో 6.4 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోయిన్‌పేటలో 6.9 డిగ్రీలు, రంగారెడ్డి ఇబ్రాహీపట్నంలో 7.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలోని బీబీపేట లో 7.9 డిగ్రీలు, మెదక్ జిల్లా ఎల్దూర్తిలో 8.1 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతారెడ్డి పేటలో 8.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3 డిగ్రీ లు, నిజామాబాద్ కోటగిరిలో 8.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్ గండీడ్‌లో 8.6 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల రుద్రంగిలో 8.7 డిగ్రీలు, నారాయణపేట్ కోస్గీలో 8.9 డిగ్రీ లు, జగిత్యాలలోని బీమారంలో 9.1 డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి.

రాబోయే రెండు, మూడు రోజులు కూడా రాష్ట్రంలో అక్కడక్క డ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వా తావారణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీ మ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.