calender_icon.png 10 December, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దీక్ష ఫలితమే జూన్ 2

10-12-2025 02:49:29 AM

  1. తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ త్యాగం
  2. ఆయన పోరాట ఫలితమే నేటి తెలంగాణ
  3. రేవంత్‌రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం
  4. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్‌కు లేదు
  5. హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం భారతీయులను అవమానించడమే
  6. విజయ్ దివస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన అని, నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెం బర్ 9 ప్రకటన వచ్చేది కాదని, నేడు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ర్టమని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగమని, కానీ రేవంత్‌రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయాలని కోరితే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, ఉద్యమకారులపైకి రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్‌రెడ్డి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీను డిగా మిగిలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రభుత్వం సృష్టించినది నకిలీ తల్లి, ఆ తల్లి చేతిలో నుంచి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. జై తెలంగాణ అన ని, ఉద్యమంలో జైలుకు వెళ్లని రేవంత్‌రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు లేదన్నారు. అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టినా, పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి భారతీయులను ఇబ్బం ది పెడుతున్నా.. ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమేనని మండిపడ్డారు. 

ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ గొప్ప నేత కేసీఆర్

పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని, అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ తేల్చి చెప్పారని హరీశ్‌రావు గు ర్తుచేశారు. ఉద్యమంలో ఆమరణ దీక్ష వల్ల, పోరాటం వల్ల ఆయన ఆయుష్షు పదేండ్లు తగ్గిందని, దేవుని దయవల్ల, తెలంగాణ ప్రజ ల ఆశీస్సుల వల్ల కేసీఆర్ ఇప్పుడు చా లా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ మళ్లీ పోరాటం చేస్తారని, కచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతా రని ధీమా వ్యక్తంచేశారు.

కేసీఆర్ పోరాటం వల్ల, తెలంగాణ రావడం వల్లే 24 గంటల కరెంటు, ఇంటింటికీ నీళ్లు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైందని చెప్పారు. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని, కానీ రేవం త్‌రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకకులాగే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సమైక్యవాదుల బాటలో నడు స్తూ రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ర్టం ఉ న్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందన్నారు.