calender_icon.png 7 May, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 05:50:06 PM

డీసీవో పద్మ, తహసీల్దార్ లాలు నాయక్..

పెన్ పహాడ్: రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి ఎస్. పద్మ, తహసీల్దార్ లాలునాయక్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారంలో పీఏసీఎస్ (నారాయణ గూడెం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ  ధాన్యాన్ని తమ తమ కల్లాల వద్దనే తూర్పార పట్టుకొని కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు.

రైతులు తాము కష్టపడి పండించిన పంటలను మధ్య దళారుల చేతిలోకి పోకుండా ఉండాలనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రతి ఒక్కరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకి రాంరెడ్డి, వైస్ చైర్మన్ మామిడి శ్రీనివాస్, సీఈవో ఆలకుంట్ల సైదులు మాజీ సర్పంచులు జానీ మియా, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి పొదిల నాగార్జున, లిఫ్ట్ చైర్మన్ మలిగిరెడ్డి సంజీవరెడ్డి, గజ్జల సైదిరెడ్డి, ధర్మారెడ్డి, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, మన్సూర్, మామిడి రవి, పిఎసిఎస్ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.