16 July, 2026 | 9:50 AM

ఇండియా కూటమి మాకు మద్దతు తెలపాలి

21-06-2024 01:33 AM

ఢిల్లీ జల సంక్షోభ పరిష్కారంలో సహకరించాలి

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

న్యూఢిల్లీ, జూన్ 20: ఢిల్లీలో జలసంక్షోభాన్ని పరిష్కరించుకు నేందుకు ఇండియా కూటమి తమకు మద్దతు తెలపాలని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కోరారు. ఢిల్లీలో గురువారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హర్యానా నుంచి ఢిల్లీకి జలాలు రాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. కావాలనే నీటిసమస్యను మరితం జటిలం చేస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జల వివాదాన్ని పరిష్కరించకుండా హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలతో డ్రామాలు ఆడుతున్నదని ధ్వజమెత్తారు. హర్యానా ప్రభు త్వం మెడలు వంచేందుకు శుక్రవారం నుంచి ఆప్ సత్యాగ్రహం చేపడుతున్నదని, ఈ దీక్షల్లో ఇండియా కూటమి భాగస్వామి కావాలనికోరారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఆప్ ప్రభుత్వం నిష్క్రియపర్వంలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల దృష్టి మరల్చడానికే నీటిశాఖ మంత్రి అతిశీ ‘సత్యాగ్రహం’ డ్రామాలకు తెరతీశారని ఆరోపిస్తున్నారు.