16 July, 2026 | 9:58 AM

అభిమానిని మట్టుపెట్టి.. ఆపై పూజలు

21-06-2024 01:32 AM

కన్నడ నటుడు దర్శన్ అసాధారణ ప్రవర్తన 

భార్య విజయలక్ష్మి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు

కేసులో కీలక ఆధారాల సేకరణ

బెంగళూరు, జూన్ 20: అభిమాని రేణుకాస్వామిని చంపించిన కేసులో కన్నడ నటుడు దర్శన్ కస్టడీని కోర్టు పొడిగించింది. ప్రస్తుతం ఆయన తూగుదీప పోలీస్ విచారణను ఎదుర్కొంటున్నాడు. విచారణలో విస్తుపోయే విషయా లు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్ ఈ నెల 9న తన అభిమాని రేణుకాస్వామిని హతమా ర్చి, అనంతరం హోస్కెరహల్లిలోని తన భార్య విజయలక్ష్మిఫ్లాట్‌కి వెళ్లాడు. దర్శన్ అసాధారణంగా ప్రవర్తిస్తూ పూజలు చేశాడు. తర్వాత మైసూర్‌కు వెళ్లిపోయాడు. విజయలక్ష్మికి క్యాస్టూ మ్స్ అసిస్టెంట్ ఇచ్చిన వస్తువులను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించేందుకు ఇప్పుడు బూట్లు, దుస్తులు కూడా కీలకం కానున్నాయి.