24 March, 2026 | 3:35 PM

మలేషియాతో భారత్ ఢీ

18-11-2024 12:41 AM

హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు నేడు మలేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడి యం వేదిక కానుంది. అక్టోబర్ 12న వియత్నాంతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. సీనియర్ ఆటగాడు సందేశ్ జింగాన్ దాదాపు పది నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఈ ఏడాది భారత్ 10 మ్యాచ్‌లు ఆడగా ఆరింటిలో ఓడి నాలుగు డ్రా చేసుకుంది. 1957లో తొలిసారి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన భారత్, మలేషియా ఆ తర్వాత 32 సార్లు తలపడగా.. చెరో 12 గెలవగా.. 8 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.