18-11-2024 12:40:08 AM
లాహోర్: పాకిస్తాన్ జాతీయ జట్టు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు పాక్ మాజీ ఆటగాడు అకీబ్ జావేద్ కోచ్‌గా ఎంపికయ్యాడు. పాక్ జట్టు త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న పాక్ జట్టు అటు నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనలో పాకిస్థాన్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.