లార్డ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర
ఏకైక టెస్టులో అద్భుత విజయం
ఇంగ్లాండ్‌పై 270 రన్స్‌తో గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా క్రాంతి గౌడ్
లార్డ్స్, జూలై 13 : భారత మహిళల క్రికె ట్ జట్టు చరిత్ర సృష్టించింది. చారిత్రక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఈ ఏకైక టెస్టులో ఆతి థ్య జట్టును 270 పరుగుల తేడాతో చిత్తు చేసింది. చాలా రోజుల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఈ టెస్టులో ఆద్యంతం భారత మహిళలదే ఆధిపత్యంగా నిలిచింది.
అటు బ్యాటింగ్‌లోనే కాకుండా ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపింది. మొదట బ్యా టింగ్ కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (83), హర్మన్ ప్రీత్ కౌర్ (58), దీప్త శర్మ (57) పరుగులతో రాణించారు. తర్వాత బౌలింగ్‌లోనూ భారత జట్టు అదరగొట్టింది.
ముఖ్యంగా యువ పేసర్ క్రాంతి గౌడ్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఐదు వికెట్లతో క్రాంతి గౌడ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. దీం తో ఇంగ్లీష్ టీమ్ కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. లార్డ్స్ గ్రౌండ్ లో ఐదు వికె ట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌గా క్రాంతి చరిత్ర సృష్టించింది. అలాగే ఆమె పేరు లారడ్స్ హానర్స్ బోర్డులో లిఖించారు. తర్వాత భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మరోసారి సత్తా చాటిం ది. స్మృతి మంధాన(70) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిస్తే షెఫాలీ వర్మ (33) కూడా రాణించింది.
తర్వాత యాస్తిక భాటియా సెంచరీతో కదం తొక్కింది. లార్డ్స్ గ్రౌండ్ లో శతకం చేసిన తొలి మహిళా బ్యాటర్ గా రికార్డులకెక్కింది. ఆమెతో పాటు రిఛా ఘోష్ హా ఫ్ సెంచరీతో రాణించింది. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 341/7 పరుగులకు డిక్లేర్ చేసింది. తర్వాత మూడోరోజు ఆటముగిసే సరికే ఇంగ్లాండ్ ఓటమి ఖాయమైపో యింది. భారత బౌలర్ల దెబ్బకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ నాలుగోరోజు తొలి సెషన్‌లోనే 186 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్సింగ్స్‌లో 2 వికెట్లు తీసిన క్రాంతి గౌడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
భారత్ మహిళల తొలి ఇన్నింగ్స్ : 285
ఇంగ్లాండ్ మహిళల తొలి ఇన్నింగ్స్ : 170
భారత్ మహిళల రెండో ఇన్నింగ్స్ : 341/7
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 186






