21 August, 2026 | 1:30 AM

భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

21-08-2026 12:18 AM

తర్వాతి రౌండ్ కు భారత్ అర్హత

మహిళల హాకీ ప్రపంచ కప్

అమస్టెల్వీన్, ఆగస్టు 20: హాకీ మహిళల ప్రపంచకప్-2026లో ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకుంది. దీంతో భారత అమ్మాయిల జట్టు పూల్-డిలో కీలక పాయింట్ సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. నాలుగు క్వార్టర్స్లోనూ ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించకపోవడంతో మ్యాచ్ డ్రా ముగిసింది. తొలి క్వార్టర్లో భారత అద్భుతంగా ఆడింది. పెనాల్టీ కార్నర్లో నవ్నీత్ కౌర్ బంతిని నెట్లోకి పంపినా, ప్లేయర్ శరీరానికి తగలడంతో గోల్ అనుమతించలేదు.

ఇంగ్లండ్‌కు వరుస పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే భారత గోల్కీపర్ సవితా పునియా, డిఫెండర్ సలీమా టెటే అద్భుతమైన డిఫెన్స్తో ఇంగ్లండ్‌కు గోల్ సాధించే అవకాశాలు ఇవ్వలేదు. ఈ డ్రాతో భారత్ ఐదు పాయింట్లు సాధించి పూల్-డి నుంచి రెండో రౌండ్కు అర్హత సాధించింది. మరోవైపు నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్‌ను నిలువరించి కీలక పాయింట్ సాధించి న భారత్ ఇప్పుడు రెండో రౌండ్లో మరింత కఠినమైన పోరుకు సిద్ధమవుతోంది.