calender_icon.png 27 September, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోద హాస్పిటల్స్ లో ఇండియాలోనే తొలి ఏంఆర్ లినాక్ ప్రారంభం

27-09-2025 11:39:01 AM

డాక్టర్ ఏం. సునీత రేడియేషన్ అంకలాజిస్ట్ 

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ యశోద హాస్పిటల్(Yashoda Hospitals) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ప్రముఖ డాక్టర్ సునీత రేడియేషన్ అంకలాజిస్ట్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు అత్యాధునిక ఎం ఆర్ లీనాక్  యాక్సిలరేటర్లను మిళితం చేసిన హైబ్రిడ్ టెక్నాలజీ, క్యాన్సర్ చికిత్సను మరింత ఖచ్చితంగా, సమర్థవంతంగా అందించేందుకు భారత్ లో మొట్ట మొదటి సరిగా యశోద హైటెక్ సిటీ బ్రాంచ్ లో ఏంఆర్ లినాక్ రూపొందించబడింది.

ప్రపంచం లో రెండవది హైదరాబాద్ యశోద లో ఏంఆర్ లినాక్ ఏర్పాటు చేశాం అన్నారు. దీని సాంకేతికత మెదడు, కాలేయం, ప్రోస్టేట్, గర్భాశయం. మృదుకణజాల, కణితుల వంటి క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్లకు ఖచ్చితమైన లక్ష్య రేడియోథెరపీని అందించగలదు. పైగా, ఇది అయనీకరణ రేడియేషన్ను ఉపయోగించ కపోవడం వల్ల, చికిత్స సమయంలో రోగుల రక్షణ మరింత పెరుగుతుంది. ఈ తాజా పరిణామం భారతదేశంలో క్యాన్సర్ థెరపీని మరో అడుగు ముందుకు నడిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విలేకరుల సమావేశం లో నవీన్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.