calender_icon.png 27 September, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు అండగా నిలవండి: జనసైనికులకు పవన్ పిలుపు

27-09-2025 11:11:35 AM

హైదరాబాద్: హైదరాబాద్‌ మూసీ వరదలపై(Musi floods) ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) స్పందించారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన(Janasena) తెలంగాణ నాయకులు, శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మూసీ వరదతో ఎంజీబీఎస్ తో పాటు పరిసరాలు నీటముగిగాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే సహాయచర్యలు చేపట్టింది. ప్రభుత్వం సూచనలు, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని పవన్ కోరారు.