calender_icon.png 27 September, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

27-09-2025 11:44:01 AM

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ టీఎన్జీవోలు సంఘం భవనంలో తెలంగాణ ఆడబిడ్డల ఆధ్యాత్మిక, సాంప్రదాయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని టీఎన్జీవోలు సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి , కార్యదర్శి సంగేం లక్షణ్ రావు  ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు: జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి  అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ ,లక్ష్మీ కిరణ్ మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేషాయి ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్  మారం జగదీశ్వర్ వివిధ డిపార్ట్మెంట్ల జిల్లా అధికారులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. 

మహిళా ఉద్యోగులు తమ తమ బతుకమ్మలను తీసుకువచ్చి సాంప్రదాయ బతుకమ్మ పాటలతో, పూల అందాలతో ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మతో టీఎన్జీవోలు సంఘం భవనం కళకళలాడింది. గేజిటేడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, హరికృష్ణ, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు ఇరుమల్ల శారద, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, నగేష్ గౌడ్, సునిత, శైలజ, సుస్మిత, వెంకట్ రెడ్డి, అజ్గర్ అలి కరుణాకర్ లవ కూమార్ కమలాకర్ శ్రీనివాస్ కామ సతీష్ గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, రోహిత్ తదితరులు కూడా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.