calender_icon.png 27 September, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న బతుకమ్మ సంబరాలు

27-09-2025 11:45:21 AM

మంగపేట,(విజయక్రాంతి): అందరిని ఆకట్టుకున్న బతుకమ్మ సంబరాలు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆవరణలో శుక్రవారం డాక్టర్ స్వప్నిత, డాక్టర్ అఖిల ఆధ్వర్యంలోనిర్వహించిన బతుకమ్మ సంబరాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు ,గోవిందరావుపేట మెడికల్ ఆఫీసర్ చంద్రకాంత్ పాల్గొని మాట్లాడుతూ మహిళల ప్రత్యేక పండుగ బతుకమ్మ పూలని దేవుళ్లుగా కొలిచే పండగ ఈ బతుకమ్మ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా పండుగ నిలుస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దవఖాన వైద్యాధికారులు చందా మనోజ్ కుమార్, గోపగాని తరుణ్ గౌడ్, సిహెచ్ఓ శారద, హెచ్ ఈ ఓ, హెల్త్ సూపర్వైజర్స్ , ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.