calender_icon.png 5 August, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో భారత్

01-02-2025 01:01:37 AM

  • సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం

ఆదివారం సౌతాఫ్రికాతో టైటిల్ పోరు

కౌలాలంపూర్: మహిళల అండర్ టీ20 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు వ రుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2023లో చాంపియన్‌గా నిలిచిన భారత్ రెండోసారి కప్‌ను అందుకునేందుకు టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది. తొలుత బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. డావినా పె ర్రిన్ (45) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ అబి నొర్‌గ్రోవ్ (30) పరుగులు చేసింది.

భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, పరునికా సిసోడియా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యా టింగ్ చేసిన భారత జట్టు 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ క మలిని (56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. గొంగడి త్రిష (35) మరోసారి మెరిసింది. ఫోబే బ్రెట్ ఒక వికెట్ పడగొట్టిం ది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.