24-11-2025 08:54:14 AM
రూ.50 వేలకు టెన్త్, రూ.75 వేలకు ఇంటర్ సర్టిఫికేట్లు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికేట్ల తయారీ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు(Cyberabad SOT Police) పట్టుకున్నారు. ఈ ముఠా టెన్త్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికేట్లు విక్రయిస్తుంది. ఎస్ఆర్ఎం, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. డిగ్రీ పట్టాలు, బోనఫైడ్, స్టడీ, బీటెక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెక్నాంపూర్ వద్ద నకిటీ సర్టిఫికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి భారీగా ఫేక్ సర్టిఫికేట్లతో పాటు బోనాఫైడ్ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూ.50 వేలకు టెన్త్, రూ.75 వేలకు ఇంటర్, రూ.1.20 లక్షలకు డిగ్రీ సర్టిఫికేట్‌కు విక్రయిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.