7 May, 2026 | 3:41 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శం

15-08-2024 03:55 PM

ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్ ( విజయ క్రాంతి): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రోజున 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, గాంధీ చౌరస్తా, నెహ్రూ చౌరస్తాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రపంచంలో భౌగోళికంగా 7వ పెద్ద దేశం మన దేశమని,ప్రాచీన సింధు నాగరికత మన సొంతమని అన్నారు. సుమారు 40 శాతం యువతరం ఉన్న దేశమని, వాణిజ్య రంగాలతో పాటు ఐటీ, ఫార్మసీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భారతీయులకు స్వేచ్ఛ,స్వాతంత్ర ఫలాలు అందించడం కోసం ఎందరో మహానుభావులు అలుపెరుగని పోరాటం చేశారని తమ ప్రాణాలను సైతం త్రుణ ప్రాయంగా ఇచ్చారని తెలిపారు. వారి త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి పౌరుడు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకట్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య,టిపిసిసి  సభ్యులు కేడం లింగమూర్తి,కర్ణ కంటి మంజుల, కోమటి స్వర్ణలత, చిత్తారి పద్మ, బుక్య సరోజన, వల్లపు రాజు, ఐ లేని అనిత, బోల్లి కల్పన, బోజు రమాదేవి, ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.