04-12-2025 01:11:10 AM
జహీరాబాద్ టౌన్, డిసెంబర్ 3 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల ను వెంటనే పరిష్కరించాలనిటియుడబ్ల్యూజేయు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, జహీరా బాద్ డివిజన్ ఇంచార్జ్ సిద్ధన్న పటేల్, జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మినహాజ్, జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదులో జరిగిన మహాధర్నా లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ప్రెస్ క్లబ్ నాయకులు రాజేష్, బసవరాజ్, అబ్దుల్ హై, జగదీశ్వర్ రెడ్డి, మక్తబాయి చందుకుమార్ తదితరులు పాల్గొన్నారు.