9 August, 2026 | 1:33 AM

అల్ఫోర్స్ ఇటెక్నో పాఠశాల విద్యార్థుల సత్తా

09-08-2026 12:00 AM

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు  

కొత్తపల్లి, ఆగస్టు 8 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు ప్రతిష్ఠాత్మక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఇటీవల హైదరాబాద్‌లోని త్యాగరాజ గాన సభ వారు 12 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎం స్నేహిత, అదిత్రీ చోటు సాధించారు. 

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవ స్థాపకులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులకు పుష్పగుచ్చాలతో పా టు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భు త విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.