calender_icon.png 24 November, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండోరోజు సఫారీలదే

24-11-2025 12:00:00 AM

  1. తేలిపోయిన భారత బౌలర్లు

శతక్కొట్టిన ముత్తుసామి

మార్కో జెన్సన్ హాఫ్ సెంచరీ

సౌతాఫ్రికా భారీస్కోరు

తొలిరోజు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 247/6.. ఈ స్కోర్ చూసిన తర్వాత రెండోరోజు సఫారీల ఇన్నింగ్స్‌కు 300 లోపే తెరపడుతుందని అంతా అనుకున్నారు. టెయిలెండర్లే కదా చుట్టేద్దామని భారత బౌలర్లు కూడా అనుకున్నారు.. కానీ రెండోరోజు సీన్ మొత్తం రివర్సయింది. ఊహించని విధంగా సఫారీ టెయిలెండర్లు భారీస్కోర్ అందించారు. ముత్తుసామి సెంచరీతో రెచ్చిపోతే,  జెన్సన్ సెంచరీకి చేరువలో ఔట య్యాడు. సౌతాఫ్రికా టెయిలెండర్లు చేసిన పరుగులు 264..  ఫలితంగా భారీస్కోర్ చేసిన సఫారీలు మెరుగైన స్థితిలో నిలిచారు. బౌలింగ్‌లో తేలిపోయిన భారత్ ఇప్పుడు బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడితే తప్ప ఈ మ్యాచ్‌లో గెలుపు కష్టమే.

గుహావటి, నవంబర్ 23 : రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న భారత్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. టీమిండియా బౌలర్ల ఫ్లాప్ షోతో రెండోరోజు సౌతాఫ్రికా పూర్తి ఆధిపత్యం కనబరి చింది. ఆరుగురు బ్యాటర్లు కలిపి 247 రన్స్ చేస్తే.. రెండోరోజు టెయిలెండర్లు చెలరేగి సౌ తాఫ్రికాకు భారీస్కోర్ అం దించారు. తొలిరోజు కీలక బ్యాటర్లను త్వరగానే పెవిలియ న్‌కు పంపిన భారత బౌలర్లు రెండోరోజు మాత్రం చేతులెత్తేశారు. ఫలితంగా ముత్తుసామి, మార్కో జెన్సన్ కీలక ఇన్నింగ్స్‌లతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సేఫ్ జోన్‌లో నిలిచింది.

నిజానికి రెండోరోజు తొలి సెషన్‌లో నే సౌతాఫ్రికాను భారత్ ఆలౌట్ చే స్తుందని చాలా మంది భావించారు. టెయిలెండర్లు ఎంత సేపు నిలబడతారులే అనుకున్నారు. అయితే పిచ్ బ్యా టింగ్‌కు అనుకూలిస్తుండడంతో ముత్తుసామి ఏడు, ఎనిమిది వికెట్లకు కీలక భాగసామ్యాలు నెలకొల్పాడు. మొదట వెరెన్నే తో కలిసి 88 రన్స్, తర్వాత మా ర్కో జెన్సన్‌తో కలిసి 97 పరుగులు జోడించారు.

ఈ పార్టనర్‌షిప్స్ సౌతాఫ్రికా భారీస్కోరుకు కారణమయ్యా యి. ముఖ్యంగా రెండోరోజు ఆటలో ముత్తుసా మి బ్యాటిం గే హైలెట్. ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో భారత బౌలర్లను విసిగించాడు. వెరెన్నే, జెన్సన్‌తో కలికి జట్టు స్కోరు ను 400 పరుగులు దాటించాడు. ఈ క్ర మంలో తన తొలి టెస్ట్ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక తొమ్మిదో స్థానం లో బ్యాటింగ్‌కు వచ్చిన మార్కో జెన్సన్ అయితే దూకుడుగా ఆడు తూ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు.

ముత్తుసామి 109(10 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్‌కు ఔటైన తర్వాత చివరి రెండు వికెట్లకు 50కి పైగా పరుగులు జోడించిన ఘనత జెన్సన్‌కే దక్కుతుంది. ఓ దశలో అతను కూ డా సెంచరీ చేసేలా కనిపించాడు. చివరికి జెన్సన్ 93 (91 బంతుల్లో 6 ఫోర్లు,7 సిక్స ర్లు) రన్స్‌కు ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు 489 పరు గుల దగ్గర తెరపడింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, జడేజా 2, సిరాజ్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు.

తర్వాత తొలి ఇ న్నింగ్స్ ఆ రంభించిన భారత్ వెలుతురు లేమితో ఆట ను నిలిపివేసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. జైస్వాల్ (7) రాహుల్ (2) క్రీజులో ఉన్నారు. భార త్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చే యడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలి.

స్కోర్ బోర్డ్ :

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 489 ఆలౌట్ ( ముత్తుసామి 109, జెన్సన్ 93 , స్టబ్స్ 49, వెరెన్నే 45, బవుమా 41 ; కుల్దీప్ యాదవ్ 4/115, బుమ్రా 2/75, జడేజా 2/94, సిరాజ్ 2/106 )

భారత్ తొలి ఇన్నింగ్స్ : 9/0 ( జైస్వాల్  7 బ్యాటింగ్ , రాహుల్ 2)