calender_icon.png 20 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవాడ గాంధీనగర్‌లో ఇండియన్ బ్యాంక్

20-08-2025 01:32:23 AM

-ప్రత్యేక మైక్రోసేట్ శాఖ ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): విజయవాడలోని గాంధీనగర్ ఎన్‌ఆర్పీ రోడ్ ఇండియన్ బ్యాంక్, జోనల్ ఆఫీస్ విజయవాడ గ్రౌండ్ ఫ్లోర్ నందు ఇండియన్ బ్యాంక్ వారు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు సంబందించి ప్రత్యేక శాఖ మైక్రోసేట్ విజయవాడ బ్రాంచీని మంగళవారం ప్రారంభించారు.

ఇండియన్ బ్యాంక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రజేష్ కుమార్‌సింగ్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్ కుమార్, జోనల్ మేనేజర్ అమరావతి ఎన్ గౌరీ శంకరరావు, జోనల్ మేనేజర్ విజయవాడ ఎం రాజేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ శాఖలో మహిళలకు స్వయం సహాయక రుణాలు, లఖ్ పతి దీదీ, ఎస్‌హెచ్‌జీ గృహలక్ష్మి, ఎంఎస్‌ఎంఈ సఖి మొదలగు రుణాలు తీసుకొనుటకు వెసులుబాటు కలదు.