calender_icon.png 20 August, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో యూరియా కొరత లేదు

20-08-2025 01:32:02 AM

వలిగొండ,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా కొరత లేదని ప్రస్తుత సీజన్ సజావుగా సాగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ఆగ్రోస్ ఫర్టిలైజర్ షాప్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం కంటే యూరియా నిల్వలు ఎక్కువగా వచ్చాయని 15 వేల మెట్రిక్ టన్నులు రావడం జరిగిందని మరో 1000 మెట్రిక్ టన్నులు వస్తుందని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులతో ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఫ్రెండ్లీగా ఉండాలని ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్మవద్దని అన్నారు.

రైతులకు కావలసిన ప్రోడక్ట్లు మాత్రమే ఇవ్వాలని ఇతర ప్రోడక్ట్ కొంటేనే యూరియా ఇస్తామని సూచించవద్దని అటువంటిది తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు  గొల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు భాస్కర్ రెడ్డితో యూరియా ఎంత కొనుగోలు చేయడం జరిగిందని తనకు ఎంత భూమి ఉందని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, మండల వ్యవసాయ అధికారి అంజనీదేవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఏఈఓ సాయి తదితరులు పాల్గొన్నారు.