16 July, 2026 | 6:28 AM

బీజేపీ ప్రవర్తనతో దేశానికి ఇబ్బందులు

09-12-2024 01:40 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: మోదీ, అదానీని టార్గెట్ చేసుకొని భారత్‌ను అస్థిరపరచడానికి అగ్రరాజ్యం యత్నిస్తోందన్న బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్  నేత శశిథరూర్ మండిపడ్డారు. అమెరికాపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ లీడర్ల కుటిల మనస్తత్వాలను చూపుతున్నాయని.. ఈ విధమైన ప్రవర్తన దేశానికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోందని అభిప్రాయపడ్డారు.

“ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను విస్మరించారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం లేదు. కీలక దేశాలతో బీజేపీ అనుసరిస్తున్న ప్రవర్తన భారతదేశానికి ఇబ్బందికరంగా మారొచ్చు’ అని శశి థరూర్ పేర్కొన్నారు.