5 June, 2026 | 9:36 PM

అమేజింగ్ ఇండియన్: మాచన రఘునందన్

05-06-2026 08:31 PM
  • డబ్ల్యూ హెచ్ వో నిపుణుల కితాబు
  • మండుటెండ లను సైతం లెక్క చేయడు..
  • విలాసం ఎరుగడు.. స్వార్ధం అసలేఎరగడు
  • ఇలా..చెప్పుకుంటూ.. పోతే.. ఎన్నో ఉన్నాయ్
  • అతని లా మరెవ్వరూ.. చేయలేరు.
  • "నో బడి కెన్ డూ లైక్ హిమ్" 
  • అని ప్రపపంచానికి చాటి చెప్పగల కార్య శూరుడు.

హైదరాబాద్: "హి ఈజ్ ఆన్ అమేజింగ్ ఇండియన్" అంటూ.. పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ ను డబ్ల్యూ హెచ్ వో ( ప్రపంచ ఆరోగ్య సంస్థ) శ్లాఘించింది. ప్రపంచ వ్యాప్త పొగాకు నియంత్రణ నిపుణుల అంతర్జాల సమావేశం జెనీవా వేదికగా గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ప్రతినిధి డాక్టర్ రాకేష్ గుప్తా.. రఘునందన్ ను పరిచయం చేసి మాట్లాడుతూ... టుబాకో కంట్రోల్ కోసం ఎంతో మందిని చూశానని కానీ, మిషన్ మోడ్ లో పని చేసే ఒకే ఒక్క వ్యక్తి గా మాచన రఘునందన్ ను పేర్కొనవచ్చన్నారు. 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కోసం అలుపెరగకుండా నిస్వార్ధంగా కృషి చేయడం సాధారణ విషయం కాదు.

తన జీవితంలో ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎంత మంది విమర్శించినా, సమాజ హితం తన అభిమతంగా ప్రయాణం చేస్తున్న అమేజింగ్ ఇండియన్ అని రఘునందన్ ను అభివర్ణించారు. లక్షలాది మంది తో మాత్రమే విప్లవం సాధ్యం అనే మాట ను తిరగరాసి నిశ్శబ్ద విప్లవం ఇలా ఉంటుంది అని జాతీయ అంతర్జాతీయ నిపుణులకు చిత్త శుద్ధి తో..కంకణ బద్దం గా పని చేస్తే ఎంతగా ..ఎలా ప్రభావం చూపుతుంది ..ఇది సాధ్యమేనా.! అని ఆశ్చర్యపడే వారికి సైతం, సాధ్యమే అని నిరూపించిన కారణ జన్ముడు మాచన రఘునందన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు,ప్రజా ఆరోగ్య నిపుణులు రఘునందన్ ను కొనియాడారు.