7 March, 2026 | 6:13 PM

పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

07-03-2026 04:39 PM

- గూడు లేని పేద వాడికి ఇల్లు

- కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు రమణారెడ్డి

- ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

బోయినిపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వన్నెల రమణారెడ్డి చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో బోయినిపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన జుట్టు రేఖ-తిరుపతి కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో శనివారం జరిగింది.

ఆయన ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది జీవితకాల కల అని అన్నారు. ఆ కలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజం చేస్తోందని తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో స్థిరత్వం, భద్రత కల్పిస్తాయని అన్నారు.

అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూ పేదలకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రోమాల అజయ్, కాంగ్రెస్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ముద్దం వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు మండల ఆర్‌ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి హన్మాండ్లు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.