108 అంబులెన్స్ లో అర్ధరాత్రి ఆడపిల్ల జననం
07-03-2026 04:35 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రూరల్ మండలం దొండరి గూడకు చెందిన రాధాబాయి అనే గర్భిణీ గతరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతూడటంతో కుటుంబీకులు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ ఈఎంటి సంతోష్, పైలట్ రాజేష్ వెంటనే గ్రామానికి వెళ్లి గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రం అవడంతో అంబులెన్స్ లోనే ప్రసూతి చేశారు. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రిమ్స్ కు తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.




