7 March, 2026 | 6:20 PM

కష్టకాలంలో మిత్రుల అండ

07-03-2026 04:44 PM

జగదేవపూర్,(విజయక్రాంతి)జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో కష్టకాలంలో ఉన్న స్నేహితురాలికి ఆమె పాఠశాల మిత్రులు అండగా నిలిచి స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 2001–2002 సంవత్సరంలో మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన మిత్రులు తమతో పాటు చదివిన స్నేహితురాలు ఎల్మా పద్మకు ఆర్థిక సహాయం అందించారు.

గత సంవత్సరం ఆమె భర్త మృతి చెందగా, ఇటీవల వారం రోజుల క్రితం ఆమె తండ్రి కూడా మరణించడంతో పద్మ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల మిత్రులు ఆమెకు ధైర్యం చెబుతూ “అధైర్యపడకు… మేమున్నాం” అంటూ ముందుకు వచ్చి రూ.11,000 నగదు సహాయంతో పాటు 75 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తీపిరెడ్డి నరేష్, లంబ సతీష్, సత్యనారాయణ, బాల్ లక్ష్మి, జయ, నవీన, సబితా, షాహిన్ తదితరులు పాల్గొన్నారు.