calender_icon.png 15 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు..

15-10-2025 07:23:22 PM

ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

మా వార్డులో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయరా ? తాజా మాజీ కౌన్సిలర్ నీరజ నారాజ్..

తాండూరు (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాండూరు మున్సిపల్ పరిధిలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ పట్టణ పరిధిలో ఉన్న 36 వార్డులకు గాను 450 ఇండ్లు మంజూరు అయ్యాయని రెండవ దశలో మరిన్ని ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి దశలవారీగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. అయితే 12వ వార్డులో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాకపోవడంతో ఆ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి సమావేశ వేదిక పైనే అసహనం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కమిషనర్ యాదగిరి, తాజా మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.