calender_icon.png 15 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ నాకా చౌరస్తాలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి

15-10-2025 07:21:06 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని నాకా చౌరస్తాలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ కోరారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత పదకొండవ రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం అంతకుముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసారని, 1998లో భారతదేశ పాక్రాన్. 2, అను పరీక్షల్లో కీలకమైన సంస్థగత, సాంకేతికలో అబ్దుల్ కలాం కీలక పాత్ర పోషించారన్నారు. అబ్దుల్ కలాం భావితరాలకు గుర్తుండిపోయేలా  ఆయన విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎండీ ముజీబ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.