25 March, 2026 | 1:42 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు

25-03-2026 12:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్చెరు, మార్చి 24 : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలతో పాటు గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు.

నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, స్థానిక కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.