రేణుకా ఎల్లమ్మ బోనాలలో పాల్గొన్న సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
10-06-2026 12:00 AM
ముకరంపుర, జూన్ 9 (విజయక్రాంతి): నగరంలోని దుర్షేడ్ లో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ బోనాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దయతో రాబోయే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, డ్యాంలు పూర్తి స్థాయిలో నీటితో కళకళలాడాలని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిని తిరుపతి, బుర్ర హరీష్ గౌడ్, పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, మురళి కృష్ణ, భూమయ్య గౌడ్, సంపత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






