2 July, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

గట్టు మండలానికి 780 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

20-06-2025 12:27 AM

లబ్ధిదారులుకు ఉత్తర్వుల పంపిణీ

గద్వాల, జూన్ 19 ( విజయక్రాంతి ) : ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై, మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ లు అన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ లు పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉం దని, అందుకే ప్రతి అర్హులైన లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామాన్ని ఎంచుకొని గతంలోనే ఎక్కువ ఇళ్లు మంజూరు చేయగా,ఈసారి గద్వాల్ నియోజకవర్గానికి మొత్తం 3500 ఇళ్లలో గట్టు మండలానికే అత్యధికంగా 780 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఇల్లు మంజూరు పత్రాలు అం దుకున్న లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించి, ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణానికి అవసరమైన రూ.5 లక్షలు ప్రభుత్వం విడతలవారీగా విడుదల చేస్తుందన్నారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, గద్వాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నల్ల హనుమంతు, ఎంపీడీఓ చెన్నయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.