26 August, 2026 | 5:30 AM

పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

14-03-2025 01:53 AM

 సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆనంద్

దేవరకొండ, మార్చి 13 :  పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. కొండమల్లేపల్లిలోని అంబేద్కర్ కాలనీలో ఎస్సీల ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు.

23 ఏండ్లుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్నపేదలకు పక్కా ఇండ్లు ఇవ్వకుండా గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వీరందరికీ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని కోరారు. 

అంబేద్కర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీల నిర్మాణం, కరెంటు, సీసీరోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా నాయకులు కావలి కృష్ణయ్య, సత్యనారాయణ, రాంబాబు తదితరులున్నారు.