తప్పుడు కూతలు కుస్తే తాట తీస్తాం
హరీష్ రావు, కవితను హెచ్చరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాట్లాడిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావ్,ఏమ్మెల్సీ కవిత గాని రేవంత్ రెడ్డి పై తప్పుడు కూతలు కూస్తే తాట తీస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. హరీష్ రావు కవిత వాడిన భాషను ఆయన తప్పుపడుతూ వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి ఇదే విదంగా కొనసాగుతె కర్మభూమికి ఎల్లాల్సి వస్తుందని .రేవంత్ రెడ్డి చెప్పిన సామెతలు బహుశా హరీష్ రావు గానీ, కవితకు గాని పల్లెటూరులో వాడే సామెతలు తెలియావన్నారు.
సాధారణంగా పల్లె టూరులలో ఊరుకి దూరం అవుతు న్నావ్ కాటికి దెగ్గర అవుతున్నవ్ అనే సామెతను ఉదాహరించారని మోహన్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో మాట్లాడుకునే యాస భాషను . రేవంత్ రెడ్డి చావు అనే పదం బాగుండదని మార్చురి అని వాడారని మోహన్ రెడ్డి అన్నారు. దీని అర్థం కెసిఆర్ కు మాత్రం తెలుసు. కానీ ఇవి తెలువని హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత మతిస్థిమితం లేనట్టుగా మాట్లాడుతున్నారాని మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ రాష్ట్రము లో 14నెలల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి గాని, సంక్షేమ పథకాలపై హరీష్ రావు కవిత దమ్ము, దేర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా మాట్లాదాలని ఆయన సూచించారు.
నిజానికి కెసిఆర్ ను మార్చురి కి పంపాలను కుంటుంది ఎవరు బీజేపీ కోవర్ట్ గా కెసిఆర్ కొడుకును, కూతురును హింసిస్తే, ఆ హింసకు తట్టుకోలేక కెసిఆర్ చనిపోతే,ఆ బీజేపీ పార్టీలో తమిళనాడు లో జయలలిత పార్టీని ఎట్లయితే బీజేపీ చేరదీసిందో అట్లనే ఇక్కడ కూడా చేసే ఆలోచన హరీష్ రావు ఉన్నాడని ప్రజలు, ప్రజల చర్చ తో పాటు మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. తప్ప కాంగ్రెస్ పార్టీ అన్న మాటలు కాదని హరీష్ రావును మోహన్ రెడ్డి విమర్శించారు. నిజంగా నీకు దమ్ము ఉంటే నోటికి వచ్చింది అరవకుండా ఉండాలని ఆయన సూచించారు.
హరీష్ రావు మాట్లాడిన మాటలను తీవ్రంగా మోహన్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు కేవలం 14 నెలలోనే ప్రజలకు అందాయని 10సంవత్సరాలనుండి బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అప్పులను వాటి తాలూకు వడ్డీలను కడుతు, ఈ రాష్టాన్ని ముందుకు తీసుకెళ్తోంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని చదివారు. గవర్నర్ గారు తన బాధ్యతను నిర్వహించారని. పది సంవత్సరాలనుండి అక్రమంగా సంపాదించిన సొమ్ము పాల్పడిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఇలాంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి పై చేస్తుంటే ఊరుకునేది లేదని, బీజేపీ కోవర్ట్ ఐనా హరీష్ రావును తీవ్రంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నరేందర్,అగ్గు బోజన్న,బాగా రెడ్డి,కనపూర్ లింగం, దుబ్బ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు






