08-01-2026 01:46:06 AM
చేగుంట, జనవరి 7: మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ కోండి రాజ్య లక్ష్మి, స్వామి, ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చీరలు ఇవ్వడం సంతోషకరమన్నారు. పేద మహిళకు ఇందిరమ్మ చీరలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణి ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. గ్రామంలో ఇంకా చీరలు అందని మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ చేస్తాంమని, రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి చీరలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సి.సి. శంకర్, మహిళా సంఘం అధ్యక్షులు యట సింధు, సి,ఏ టప్ప మేనక, మహిళలు పాల్గొన్నారు.