calender_icon.png 9 January, 2026 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్యం నుంచి గ్రామాన్ని రక్షించాలి

08-01-2026 01:45:37 AM

జేసీ ఎదుట బిక్కనూరు గ్రామస్తుల ఆవేదన 

కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): కాలుష్య పరిశ్రమలు వద్దు.. తమ ప్రాణాలే ముద్దు అంటూ బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు వాసులు అధికారుల ముందు తమ గోడును వెళ్లబుచ్చారు. భిక్కనూరులో ఫ్యూజన్ ఫార్మా విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రజల అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన జాయింట్ కలెక్టర్ విక్టర్ ముందు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బిక్కనూర్ పెద్ద మల్లారెడ్డి శివారులో ఉన్న ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీ వల్ల తీవ్రంగా కాలుష్యం ఏర్పడి ఆరు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు.

తమ ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఫార్మా కంపెనీ విస్తరణ వద్దం టూ గ్రామస్తులు ఖరాకండిగా చెప్పారు.  భిక్క నూర్ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో వ్యాపా రస్తులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసి మద్దతు తెలిపారు.  అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

భిక్కనూర్‌తో పా టు పెద్ద మల్లారెడ్డి బస్వాపూర్ రామేశ్వర్ పల్లి కాచాపూర్, మల్లుపల్లి, సంగమేశ్వర్, తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఆవేదనను వ్యక్త పరిచారు. కాలుష్య పరిశ్రమ లను నెలకొల్పితే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ  హెచ్చరించారు.