ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చూడాలి
రాష్ట్ర హౌజింగ్ ఎండి వి.పి. గౌతమ్
ఖమ్మం, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీ సుకోవాలని రాష్ట్ర హౌజింగ్ ఎండి వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కూసుమం చి మండలం నాయకన్ గూడెం, ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల గ్రామాల్లో హౌజింగ్ ఎండి పర్యటించి, ఇందిరమ్మ ఇం డ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్దిదారులతో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా హౌ జింగ్ ఎండి కూసుమంచి మండలం నాయకన్ గూడెం లో నిర్మాణంలో ఉన్న కె. ఉమ, సిహెచ్. సునీత, వెంకటమ్మ, ఆండాలమ్మ, ల లిత, వెంకటరమణమ్మ ల ఇందిరమ్మ ఇం డ్లను, ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన విజయకుమారి, నరేష్, మమత, రాజ్యం ల ఇందిర మ్మ ఇండ్లను పరిశీలించారు.లబ్దిదారులతో నిర్మాణాల్లో ఇబ్బందులు కల్గుతున్నాయా, ఇసుక సరఫరా, ఇటుకల కొనుగోలు, నిర్మా ణం ఖర్చు, బిల్లులు జమ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇం టి నిర్మాణానికి ముందు ఎలాంటి ఇంట్లో ఉంటున్నది, మంజూరు మొదలు ఏ దశలోను అధికారులు ఎవరైనా లంచాలు అడుగుతున్నారా అని లబ్ధిదారులను ప్రశ్నించారు.హౌజింగ్ ఎండి పర్యటన సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, తహశీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్, ఎంపిడివో లు రామచందర్, తదితరులు ఉన్నారు.






