ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
31-08-2026 12:00 AM
దామరచర్ల , ఆగస్టు 30 : ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పేర్కొన్నారు. దామరచర్ల మండలం కొత్తపేట తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలు, శోభన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






