17-05-2025 12:42:57 AM
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపక్షం
కామారెడ్డి, మే 16,(విజయ క్రాంతి): కా మారెడ్డి జిల్లా దోమకొండ మండలం లోని లింగుపల్లి, అంచనూర్, చింతామన్ పల్లి, అంబర్పేట్, దోమకొండ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల అసమర్ధత వలన ఒక్క డబుల్ బెడ్ రూమ్ నిర్మాణము కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు పథకం తీసుకువచ్చారని అన్నారు. 1989 సంవత్సరంలో ప్లాట్లు, ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కు ఉందని అన్నారు.
2004 నుండి 75 వేలు, స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మించి ప్రారంభించారని గుర్తు చేసారు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేయడం ప్రాముఖ్య పాత్ర వహిస్తుందని గుర్తు చేసారు. కామారెడ్డి ని యోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కృషితో ఈసారి ఐదు లక్షల స్కీం తో ప్రారంభించ డం సంతోషకరమని అన్నారు.
లింగుపల్లి గ్రామం లో 7 గురు శంకుస్థాపన చేశారనీ, అంచునూరు గ్రామంలో 11 శంకుస్థాపనలు, అంబారిపేటలో 25 శంకుస్థాపనలు, చింతామణి పల్లి లో 16 శంకుస్థాపనలు, దోమ కొండ లో 12 శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిర మ్మ ఇల్లు కమిటీ సభ్యులు,లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.